వాషింగ్టన్ : ఈ నెల 11న ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల కోసం ఇరాన్ 10 అంశాలతో పంపిన ప్రతిపాదనలు గందరగోళంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ విమర్శించారు. తన ప్రతిపాదనలను మూడు వేర్వేరు ముసాయిదాల్లో ఇరాన్ పంపిందని, దీంట్లో మొదటి వెర్షన్ చాట్‌జీపీటీతో రాసి ఉండవచ్చు.. అంటూ ఆయన ఆక్షేపించారు.
ఇలా మూడు వేర్వేరు ముసాయిదాల్లో ప్రతిపాదనలు పంపితే.. దీంట్లో దేనిని చర్చలకు ప్రాతిపదికగా తీసుకోవాలన్న దానిపై గందరగోళం ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పంపిన 10 అంశాలతో కూడిన ప్రతిపాదనలను అమెరికా అంగీకరించిందని, అనంతరం కాల్పుల విరమణ ప్రకటన వెలువడిందని ఇరాన్ నాయకత్వం చెబుతున్నది.