India-Canada | కెనడాతో వివాదం.. భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఏమీ లేదన్న అమెరికా
India-Canada | ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు (Khalistani terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్ (India) – కెనడా (Canada) మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల మధ్య నెలకొన్ని వివాదంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా (America) స్పందించింది. రెండు దేశాలతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.
India-Canada | ఖలిస్తాన్ ఏర్పాటువాద నాయకుడు (Khalistani terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యతో భారత్ (India) – కెనడా (Canada) మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఆ తర్వాత దౌత్యవేత్తలను కెనడా బహిష్కరించింది. అయితే, దీనిపై భారత్ సైతం ఘాటుగానే స్పందించింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. వీసా సేవలను సైతం నిలిపివేసింది. కెనడాలో ఉన్న భారతీయులకు అప్రమత్తంగా ఉండాలంటూ అలెర్ట్ జారీ చేసింది.
కాగా, రెండు దేశాల మధ్య నెలకొన్ని వివాదంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా (America) స్పందించింది. రెండు దేశాలతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (US National Security Advisor) జేక్ సల్లివన్ (Jake Sullivan) గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఈ అంశంపై దౌత్యవేత్తలతో జరిగిన ప్రైవేటు సంభాషణల గురించి నేను మాట్లాడను. ఈ విషయంలో భారత్‌లో ఉన్న అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక ముందు కూడా వారితో టచ్‌లో ఉంటాం’ అని అన్నారు.
ఇక ఇదే సమావేశంలో ‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దౌత్యపరమైన వివాదంపై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నారా..?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇది మాకు (అమెరికా) ఆందోళన కలిగించే విషయం. ఇది మేము తీవ్రంగా పరిగణించే అంశం. నిరంతరం దీనిపై సంప్రదింపులు చేస్తాం. ఈ విషయంలో భారత్‌కు ‘ప్రత్యేక మినహాయింపు’ ఏమీ లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
Chennai cabbie | కారు డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ..!
Parineeti-Raghav Chadha | ఉదయ్‌పూర్ చేరుకున్న కాబోయే కొత్త జంట.. పిక్స్ వైరల్
Apple iPhone | యాపిల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ షురూ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

