US midterm election: నార్త్ కరోలినా సెనేటర్‌గా మూడోసారి ఎన్నికైన భారతసంతతి వ్యక్తి.. తల్లిదండ్రులది హైదరాబాద్
ఉత్తర కరోలినా సెనేటర్‌గా మూడోసారి ఎన్నికైన ముజ్తబ మొహమ్మద్
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ముజ్తబ మొహమ్మద్ ఉత్తర కరోలినా సెనేటర్‌గా విజయం సాధించాడు. ఇతను నార్త్ కరోలినా సెనేటర్‌గా ఎన్నికవ్వడం ఇది మూడోసారి. ముజ్తబ మెక్లెన్బర్గ్ కౌంటీ 38వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘నార్త్ కరోలినా సెనేటర్‌గా మూడోసారి ఎన్నికయ్యాను. మీ అందరి మద్దతుతో ఈ ఎన్నికలో గెలిచాను. విద్యలో పెట్టుబడుల కోసం, వైద్యసాయాన్ని సెనేట్‌లోని అన్ని ప్రాంతాలకు వర్తింపచేయడం కోసం కృషి చేస్తాను. అంతేకాదు కరోనా టైంలో దివాళా తీసిన చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలబడతాను’ అని ట్వీట్ చేశాడు.
ముజ్తబ తల్లిదండ్రులది హైదరాబాద్. మల్లేపల్లి ప్రాంతంలో ఉండే వీళ్లు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. ముజ్తబ అమెరికాలోనే పుట్టాడు. కరోలినా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ముజ్తబ ఆ తర్వాత న్యాయశాస్త్రం మీద ఆసక్తితో లా చదివాడు. కుటుంబ కేసుల్ని వాదిస్తుంటాడు. ఈ మధ్యంతర ఎన్నికల్లో ముజ్తబతో పాటు 82 మంది ముస్లింలు సెనేటర్లుగా గెలుపొందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

