Joint Baby Shower | ఐదుగురిని గర్భవతులు చేశాడు.. వారితో కలిసి ఫొటోకు పోజిచ్చాడు
Joint Baby Shower | ఒక యువకుడు ఐదుగురు మహిళలను గర్భవతులుగా చేశాడు. కడుపుతో ఉన్న వారితో కలిసి ఫొటోకు పోజిచ్చాడు. (Joint Baby Shower) ఐదుగురు మహిళల ద్వారా ఐదుగురు సంతానానికి స్వాగతం పలుకనున్నట్లు పేర్కొన్నాడు.
వాషింగ్టన్: ఒక యువకుడు ఐదుగురు మహిళలను గర్భవతులుగా చేశాడు. కడుపుతో ఉన్న వారితో కలిసి ఫొటోకు పోజిచ్చాడు. (Joint Baby Shower) ఐదుగురు మహిళల ద్వారా ఐదుగురు సంతానానికి స్వాగతం పలుకనున్నట్లు పేర్కొన్నాడు. విస్తూపోయే ఈ సంఘటన అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌కు చెందిన 22 ఏళ్ల జెడ్డీ విల్ ఒక సంగీతకారుడు. అతడితో సంబంధం ఉన్న ఐదుగురు మహిళలు గర్భం దాల్చారు. ఈ నేపథ్యంలో వారంతా కలిసి ఒక చోట వేడుక చేసుకున్నారు. జనవరి 14న క్వీన్స్‌లో షవర్లో పార్టీ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా తన వల్ల ప్రెగ్నెంట్ అయిన ఐదుగురు మహిళలతో కలిసి జెడ్డీ విల్ ఫొటోలు దిగాడు. ‘లిటిల్ జెడ్డీ విల్స్ 1-5కు స్వాగం’ అన్న పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కాగా, ఇప్పుడు తామంతా జెడ్డీ విల్‌కు భార్యలమని గర్భవతి అయిన 29 ఏళ్ల ఆష్లీ తెలిపింది. బహుభార్యలున్న కుటుంబ జీవితాలకు సంబంధించిన టీఎల్సీ షోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తల్లులు కాబోతున్న తనతోపాటు బోనీ బీ, కే మెరీ, జిలీన్ విలా, ఇయాన్లా కలీఫా గల్లెట్టి ఒకేచోట కలిసి ఉండేందుకు అంగీకరించినట్లు చెప్పింది. తమ పిల్లల మంచి కోసం పెద్ద కుటుంబంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది. తమ కుటుంబాలు కూడా దీనికి అంగీకరించాయని చెప్పింది.
మరోవైపు జెడ్డీ విల్ ద్వారా గర్భవతులైన ఐదుగురు మహిళలు కలిసి దిగిన ఫొటోలు, డ్యాన్స్ చేస్తూ ఆనందించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆష్లీ షేర్ చేసింది. వైరల్ అయిన ఈ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఒక వ్యక్తి ద్వారా ఐదుగురు మహిళలు గర్భవతులు కావడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సంప్రదాయేతర జీవితానికి ఆ మహిళలు, వారి కుటుంబాలు ఎలా అంగీకరించాయోనని కొందరు ప్రశ్నించారు. ఇది నమ్మదగినదిగా లేదని, నిజం కాదనిపిస్తోందని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

