వాషింగ్టన్ : అమెరికాలోని ఓహియోలో దారుణం జరిగింది. దొంగగా భావించి కూతురిని తండ్రి తుపాకీతో కాల్చి చంపాడు. బుధవారం తెల్లవారుజామున 16 ఏండ్ల యువతి తన ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించింది. ఆ యువతిని దొంగగా భావించిన తండ్రి.. క్షణం ఆలోచించకుండా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన తల్లి బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.