ఐదేళ్ల కిందట నోస్ రింగ్ కోల్పోయిన వ్యక్తి… ఊపిరితిత్తుల్లో కనుగొన్న డాక్టర్లు
ఎక్స్ రే చూసి లికిన్స్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ నోస్ రింగ్ కోసం తాను తెగ వెతికానని చెప్పాడు. చివరకు తన ఊపిరితిత్తుల్లోకి అది చేరుకున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు.
వాషింగ్టన్: ముక్కుకు ధరించే రింగ్‌ను ఒక వ్యక్తి ఐదేళ్ల కిందట కోల్పోయాడు. అయితే ఇటీవల అతడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ రింగ్ అతడి ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సర్జరీ ద్వారా దానిని బయటకు తీశారు. అరుదైన ఈ సంఘటన అమెరికాలో జరిగింది. 35 ఏళ్ల జోయ్ లికిన్స్, తన ముక్కుకు రింగ్ ధరించేవాడు. ఐదేళ్ల కిందట అతడు నిద్ర నుంచి లేచిన తర్వాత అది కనిపించలేదు. ఆ మంచం అంతటా వెతికినా ఫలితం లేకపోయింది. ఒకవేళ పొరపాటున మింగి ఉంటానని అతడు అనుకున్నాడు. ఆ నోస్ రింగ్‌పై ఆశలు వదులుకున్నాడు.
కాగా, జోయ్ లికిన్స్కు ఇటీవల రాత్రి వేళ బాగా దగ్గు వచ్చింది. దగ్గుతున్నప్పుడు వెనక వైపు చాలా నొప్పిగా అనిపించింది. దీంతో అతడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. న్యుమోనియా లక్షణాలుగా తొలుత వైద్యులు భావించారు. అయితే ఎక్స్ రే తీసిన తర్వాత వారికి అసలు విషయం తెలిసింది. కుడి ఊపిరితిత్తు పైభాగంలో అతడు పోగొట్టుకున్న నోస్ రింగ్ ఉంది. ఈ ఎక్స్ రే చూసి లికిన్స్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ నోస్ రింగ్ కోసం తాను తెగ వెతికానని చెప్పాడు. చివరకు తన ఊపిరితిత్తుల్లోకి అది చేరుకున్నట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు.
మరోవైపు జోయ్ లికిన్స్ ఊపిరితిత్తిలో ఉన్న ఆ నోస్ రింగ్‌ను సర్జరీ ద్వారా డాక్టర్లు బయటకు తీశారు. అయితే దీనిని తాను ఎప్పటికీ ధరించనని అతడు తెలిపాడు. గుర్తుగా తన వద్ద ఉంచుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం తన వద్ద 12 నోస్ రింగ్స్ ఉన్నాయని అతడు వెల్లడించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

