అమెరికా పాక్‌ను బానిస చేసేసింది… మళ్లీ అగ్రరాజ్యంపై భగ్గుమన్న ఇమ్రాన్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను అమెరికా బానిసగా మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమించుకోకుండానే పాక్‌ను అమెరికా బానిసగా మార్చేసుకుందంటూ మండిపడ్డారు. వలసవాద ప్రభుత్వాన్ని పాక్ ప్రజలు ఎన్నడూ అంగీకరించరని పునరుద్థాటించారు.
ఫైసలాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాజీ ప్రధాని ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా స్వావలంబన కలిగిన దేశమని, అయినా… లాభం లేనిదే ఇతర దేశాలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయదని ఇమ్రాన్ దుమ్మెత్తిపోశారు.
పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అమెరికా పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ డబ్బులు యాచిస్తారంటూ ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగితే… అధికారంలోకి రాలేమన్న విషయం వారికి బోధపడిందన్నారు.
మంత్రి బిలావల్ భుట్టో, ఆయన తండ్రి ఆసిఫ్ అలీ ఇద్దరూ అవినీతిపరులని, ప్రపంచంలో కొన్ని చోట్ల ఈ అక్రమ సంపాదనను దాచేశారని ఇమ్రాన్ ఆరోపించారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్‌కు వారెక్కడ దాచారో తెలుసని, అందుకే బిలావల్ వారిపై ఎక్కువ ఒత్తిడి చేయరని ఇమ్రాన్ ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

