Israel-Iran War | కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధం.. హెజ్బొల్లా సంస్థ హెచ్చరిక
Israel-Iran War : ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది.
Israel-Iran War : ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తే, తిరిగి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని చెప్పింది. ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కూడా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
పది రోజులపాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కూడా అమెరికా వెల్లడించింది. ఇజ్రాయెల్-లెబనాన్ దేశాల నేతల మధ్య దశాబ్దాల తర్వాత తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించాడు. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కూడా కాల్పుల విరమణ పాటిస్తూ, ఈ పది రోజులు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. దీనివల్ల ఎలాంటి చంపుకోవడాలు, దాడులు ఉండవని, శాంతి ఏర్పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ స్పందిస్తూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించకపోతే, తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్‌లోని ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు. ఇంతకాలం యుద్ధం నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాల్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
అయితే, ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో తిరిగి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా బీరుట్ దక్షిణ ప్రాంతాల్లోని ప్రజలు తిరిగి వెళ్తు్న్నారు. అయితే, ఈ అంశంపై లెబనాన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని చైనా స్వాగతించింది. మరోవైపు ఇరాన్లో కిండర్‌గార్టెన్ స్కూల్స్ మూసివేయాలని ఆ దేశం నిర్ణయించింది. చిన్నారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

