వాషింగ్టన్: వర్క్ వీసా జారీ వ్యవస్థలో అగ్రదేశం అమెరికా విస్తృతమైన మార్పులు చేసిన క్రమంలో ఈ సంవత్సరం హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు ట్రంప్ యంత్రాంగం గురువారం ప్రకటించింది. ‘భారీ సంఖ్యలో తక్కువ వేతనాలతో నమోదు చేసుకోవడం ద్వారా ఈ పథకాన్ని దుర్వినియోగం చేసే రోజులు ముగిశాయి’ అని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానించారు. అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలు (యూఎస్సీఐఎస్) అందించిన వివరాల ప్రకారం 2026లో ఈ దరఖాస్తుల సంఖ్య 3,43,981 ఉండగా, 2027 ఆర్థిక సంవత్సరానికి 2,11,600కు చేరుకున్నాయని, ఇది 38 శాతం తగ్గుదల అని వివరించింది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వేతన నిబంధనలు మార్చడంతో పాటు భారీగా దరఖాస్తు ఫీజును పెంచారు.