Green Card | గ్రీన్‌కార్డ్ కోసం దశాబ్దాలుగా నిరీక్షణ.. యూఎస్‌లో నివాస హక్కుల కోసం 12 లక్షల మంది భారతీయుల ఎదురుచూపు
అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే ‘గ్రీన్ కార్డు’ కోసం అక్కడి భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు.
Green Card | వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే ‘గ్రీన్ కార్డు’ కోసం అక్కడి భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్‌లో భారతీయుల సంఖ్య 2023 నవంబర్ 2 నాటికి 12,59,443కు చేరుకున్నది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) డాటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) తాజా గణాంకాల్ని విడుదల చేసింది. డాక్టర్లుగా, సైంటిస్టులుగా, కాలేజీ ప్రొఫెసర్లుగా, మల్టీనేషనల్ కంపెనీ సీఈవోలుగా.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం గ్రీన్ కార్డు పొందలేక అవస్థ పడుతున్నారు.
ఇది.. వ్యక్తిగతంగా వారిపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. చైనా, ఫిలిప్పైన్స్ దేశాలతో పోల్చితే గ్రీన్ కార్డ్ పొందటంలో భారతీయుల వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువగా ఉంది. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్‌లో 1,48,000 మంది చైనావాళ్లు ఉన్నారని నివేదిక తెలిపింది. దీనికి కారణం అమెరికా వలస విధానమని నివేదిక అభిప్రాయపడింది. అమెరికా చట్టసభ కాంగ్రెస్ సరైన చర్య తీసుకోకపోతే, గ్రీన్ కార్డు కోసం నిరీక్షించే భారతీయ వృత్తి నిపుణుల సంఖ్య 2030నాటికి 21,95,795కు చేరుకుంటుందని ‘ఫోర్బ్స్’ అంచనావేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

