కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వని ఎఫ్‌డీఏ

న్యూఢిల్లీ: ఇండియాలో అభివృద్ధి చేసిన తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించింది. అమెరికాలో అక్యుజెన్ అనే ఫార్మా కంపెనీ కొవాగ్జిన్ సప్లై కోసం భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యవసర వినియోగానికి నో చెప్పడంతో ఇప్పుడు తాము పూర్తిస్థాయి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని అక్యుజెన్ వెల్లడించింది. యూఎస్ ఎఫ్‌డీఏ చెప్పిన ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం కూడా మరింత డేటా వాళ్లు కోరారని ఆ సంస్థ చెప్పింది.
అత్యవసర వినియోగానికి అనుమతి సాధించేలా కనిపించామని, అయితే ఎఫ్‌డీఏ మాత్రం బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా సూచించిందని అక్యుజెన్ తెలిపింది. ఈ ప్రక్రియకు సమయం పడుతుందని, అయితే కొవాగ్జిన్‌ను అమెరికాకు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని అక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో కొవాగ్జిన్‌కు సంబంధించిన పాక్షిక సమాచారాన్ని మాత్రమే ఎఫ్‌డీఏకు అక్యుజెన్ సమర్పించింది. గత నెలలోనే ఇక ఏ వ్యాక్సిన్‌కూ తాము అత్యవసర అనుమతి ఇవ్వబోమని ఎఫ్‌డీఏ తేల్చిచెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

