Afghanistan | ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా అమెరికా ప్రతీకార దాడులు
అమెరికా దాడులు | కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్‌లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి.

కాబూల్: కాబూల్ వరుస పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నది. గురువారం సాయంత్రం కాబూల్‌లోని విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐసిస్ శిభిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగహార్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడి చేశామని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వెలుపల నుంచి ఈ దాడి జరిపినట్లు చెప్పారు. కాగా, కాబూల్ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, అందువల్ల పౌరులు ఎయిర్‌పోర్టును ఖాళీ చేయాలని అమెరికా హెచ్చరించింది.

గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో 183 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉండగా, 170 మంది ఆఫ్ఘన్ పౌరులు ఉన్నారు. మరో 200 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఐసిస్ నాయకులను అంతమొందించాలని సైన్యాన్ని ఆదేశించారు. దీంతో అమెరికా సైన్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

