రావత్ మృతి పట్ల సంతాపం తెలిపిన అమెరికా

వాషింగ్టన్: ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి అమెరికా రక్షణశాఖ నివాళి అర్పించింది. రావత్ కుటుంబసభ్యులతో పాటు ఆ ప్రమాదంలో చనిపోయిన బాధితులందరికీ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సంతాపం తెలిపారు. భారత్, అమెరికా రక్షణ సంబంధాల మధ్య రావత్ కీలక పాత్ర పోషించినట్లు ఆస్టిన్ తెలిపారు. రావత్ మృతి పట్ల అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లే కూడా నివాళి అర్పించారు. భారతీయ సైన్యంపై రావత్ ప్రభావం ఎక్కుగా ఉంటుందన్నారు. రెండు దేశాల మధ్య సైనిక బంధాల బలోపేతం కోసం రావత్ కృషి చేసినట్లు జనరల్ మార్క్ మిల్లే తెలిపారు. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. రావత్ విషాదకర మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు పెంటగార్ కార్యదర్శి జాన్ కిర్బీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

