Indian Student Killed | రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని మృతి.. ఆమె ప్రాణాలకు విలువ లేదంటూ అమెరికా పోలీస్ హేళన
Indian Student Killed | అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణించింది.
వాషింగ్టన్: అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణించింది. (Indian Student Killed) నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలోని సీటల్ క్యాంపస్‌లో మాస్టర్స్ ఢిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థిని మరణం పట్ల ఒక పోలీస్ అధికారి చాలా చులకనగా, హేళనగా మాట్లాడాడు. ఆమె ప్రాణాలకు విలువలేదని సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ తన సహోద్యోగితో అన్నాడు. డేనియల్ నవ్వుతూ.. ‘ఆమె చనిపోయింది. సాధారణ వ్యక్తి’ అని తెలిపాడు. అలాగే మళ్లీ నవ్వుతూ.. ‘ఒక చెక్ రాయండి. పదకొండు వేల డాలర్లకు’ అని చెప్పాడు. ఆమె వయసు 26 ఏండ్లని, ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ అన్నాడు.
కాగా, పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ మరో పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిన ఈ సంభాషణ అతడి బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌ను సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ సోమవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇది వైరల్ కావడంతో పోలీస్ అధికారి డేనియల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోలీస్ అధికారిపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

