US-Canada Border | నయాగరా జలపాతం సమీపంలో పేలుడు.. అమెరికా-కెనడా సరిహద్దు మూసివేత
అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న నయాగరా జలపాతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు.
న్యూయార్క్: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న నయాగరా జలపాతం (Niagara Water Falls) సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు సరిహద్దులను (US-Canada Border) మూసివేశారు. నయాగరా జలపాతం సమీపంలోని రెయిన్ బ్రిడ్జి (Rainbow Bridge) వద్ద ఓ కారులో పేలుడు చోటుచేసుకున్నది. పేలుడు దాటికి.. కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపోయింది. కారు బాంబు దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే ఈ బ్రిడ్జి రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు. నయాగరా జలపాతానికి పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న మరో మూడు బ్రిడ్జిలను కూడా బంద్ చేశారు.
యూఎస్-కెనడా సరిహద్దును దాటుతుండగా ఈ బాంబు పేలుడు సంభవించిందని నయాగరా ఫాల్స్ మేయర్ కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాలను అనుసంధానం చేసే సరిహద్దు వంతెనకు సంబంధించిన విషయం కావడంతో ఎఫ్బీఐ జాయింట్ టెర్రరిజమ్ టాస్క్ఫోర్స్ దర్యాప్తు చేస్తున్నదని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ (Kathy Hochul) తెలిపారు. అయితే ఈ పేలుడు వెనుక ఎలాంటి ఉగ్రవాద చర్య (Terrorist Activity) లేదని తెలుస్తున్నదని వెల్లడించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.

🚨#BREAKING: New surveillance video shows the moment when the white vehicle went airborne and crashed at the Rainbow Bridge Crossing checkpoint before going up in flames near Niagara Falls pic.twitter.com/7I2JGM9aTw
— R A W S A L E R T S (@rawsalerts) November 22, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- car
- Closed
- Explosion
- Kathy Hochul
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

