Booster Dose: ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే.. బూస్టర్ డోసు వేసుకోండి

న్యూయార్క్: రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు బూస్టర్ కోవిడ్ టీకా డోసు ( Booster Dose ) తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. దేశంలో మరోసారి కరోనా మహహ్మారి విజృంభిస్తోందని, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మళ్లీ కరోనా ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే వాళ్లంతా అదనపు డోసు టీకా తీసుకోవాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అమెరికాలో సుమారు మూడు శాతం మందిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇప్పటికే ఆ దేశంలో ఫైజర్, మోడెర్నా టీకాలను ఇచ్చారు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్లు.. ఆయా టీకా అదనపు డోసులను తీసుకోవాలని ఎఫ్‌డీఏ కోరింది.
ఔషధాలు వాడుతున్నవారు.. ఇమ్యూనిటీని తగ్గించే వ్యాధులు ఉన్నవారు.. కోవిడ్ టీకాల నుంచి రక్షణ పొందనివారు.. మరో డోసు టీకాను తీసుకోవాలని ఎఫ్‌డీఏ తెలిపింది. అవయవ మార్పుడులు జరిగిన రోగుల్లో కోవిడ్ టీకాలతో కేవలం 15 శాతం మాత్రమే రక్షణ ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాంటి వారు మూడవ డోసు తీసుకోక తప్పదు. ట్రాన్స్‌ప్లాంట్ రోగుల్లో మూడవ డోసు అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తేల్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

