US Attorney General : అమెరికా అధ్యక్షుడి నివాసమైన శ్వేత సౌధం (White House)లో కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తుపాకీతో లోపలికి చొరబడిన నిందితుడు కొలే థామస్ అలెన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఆయన ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకున్నాడని అని అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే (Todd Blanche) తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్ సంఘం విందు సమయంలో భద్రతా తనిఖీ పాయింట్ వద్ద కాల్పులకు తెగబడిన వద్ద నుంచి తుపాకులతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
వైట్ హౌస్ కరస్పాండెంట్ సంఘం విందు జరుగుతుండగా భదత్రా తనిఖీ పాయింట్ వద్ద కాల్పులు జరిపిన కొలె థామస్ అలెన్ అధ్యక్షుడు ట్రంప్ సహా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కీలక నేతలను లక్ష్యంగా చేసుకున్నాడని టాడ్ బ్లాంచే పేర్కొన్నారు. విందు సమయానికి ముందు నుంచే థామస్ అలెన్ హోట్లోనే ఉన్నాడు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా కీలక నేతలను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు. పరిపాలనా వ్యవస్థలోని నాయకులే థామస్ టార్గెట్. కాల్పులకు పాల్పడక ముందు అతడి కదలికలపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి అని బ్లాచే వెల్లడించాడు.
Firing at White House Correspondents’ Dinner in Washington, DC | US President Donald Trump posts a video of the accused shooter running past the Secret Service checkpoint outside the hotel ballroom where the White House Correspondents’ Dinner was taking place. pic.twitter.com/thusxg0sPp
— ANI (@ANI) April 26, 2026
శ్వేత సౌధంలోని ప్రధాన బాల్ రూమ్లో వార్షిక విందు కోసమని 2,600 మందికిపైగా అతిథులు విచ్చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర కీలక నేతలు హాజరైన ఈ విందును థామస్ అలెన్ టార్గెట్ చేసుకున్నాడు. లోపలికి దూసుకొచ్చే క్రమంలో అతడు భద్రతా తనిఖీ పాయింట్ వద్ద కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిందితుడిని హత్యా ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. హఠాత్పరిణామంతో భయాందోళనలు నెలకొనగా.. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర సీనియర్ అధికారులను సిబ్బంది రక్షణగా ఏర్పడి బాల్ రూమ్ గుండా తరలించారు.
A suspected gunman has been arrested after firing shots at a hotel which was hosting the White House Correspondents’ Association dinner for Donald Trump in Washington DC.
Sky’s @Stone_SkyNews, who was in the room when gunshots were heard, goes through a timeline of the events… pic.twitter.com/lq7tAquNdj
— Sky News (@SkyNews) April 26, 2026