పొరపాటు జరిగింది.. ఆ డ్రోన్ దాడి చేసింది మేమే

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై ఆగస్టులో జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై అమెరికా స్పందించింది. ఆ డ్రోన్ దాడి చేసింది తామే అని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఆగస్టు 29వ తేదీన జరిగిన దాడిలో.. ఓ కార్మికుడితో పాటు ఓ ఫ్యామిలీకి చెందిన 9 మంది ఆ దాడిలో మృతిచెందారు. దాంట్లో ఏడు మంది చిన్నారులు కూడా ఉన్నారు. కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడ బాంబు దాడి జరిగిన కొన్ని రోజులకు అమెరికా దళాలు డ్రోన్ అటాక్ చేశాయి. అంతర్జాతీయ ఎయిడ్ వర్కర్‌గా ఉన్న ఆ వ్యక్తి కారును అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ట్రాక్ చేశారు. ఐఎస్-కే మిలిటెంట్లకు అతను చెంది ఉంటారని అతను ఉంటున్న ఇంటిపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ మెకంజీ తెలిపారు. ఓ ఇంటి కాంపౌండ్‌లో ఆ వ్యక్తి కారులో పేలుడు పదార్ధాలు లోడింగ్ చేస్తున్నట్లు డ్రోన్ ద్వారా గుర్తించామని, కానీ వాస్తవానికి అవి వాటర్ బాటిళ్లు అని తేలినట్లు అమెరికా స్పష్టం చేసింది. ఆ డ్రోన్ దాడి ఓ విషాదకర పొరపాటు అని జనరల్ మెకంజీ తెలిపారు. అయితే ఇంటెలిజెన్స్ సమాచారం అందించిన వారిలో తాలిబన్లు లేరని ఆయన తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

