Kamikaze Drones: 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ జెట్‌ను పేల్చివేసిన రష్యా డ్రోన్.. వీడియో
Kamikaze Drones:: కమికేజ్ డ్రోన్లను రష్యా అప్‌గ్రేడ్ చేసింది. చాలా దూరంలో ఉన్న ఉక్రెయిన్ వైమానిక క్షేత్రాలను కూడా ఇప్పుడు ఆ డ్రోన్లు చేరుకోగలవు. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ఉన్న జెట్‌ను.. కొత్తగా డెవలప్ చేసిన కమికేజ్ డ్రోన్ పేల్చివేసింది.
మాస్కో: లాన్సెట్ కమికేజ్ డ్రోన్ల(Kamikaze Drones)ను రష్యా అప్‌గ్రేడ్ చేసింది. చాలా దూరంలో ఉన్న ఉక్రెయిన్ వైమానిక క్షేత్రాలను కూడా ఇప్పుడు ఆ డ్రోన్లు చేరుకోగలవు. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ఉన్న జెట్‌ను.. కొత్తగా డెవలప్ చేసిన కమికేజ్ డ్రోన్ పేల్చివేసింది. ఉక్రెయిన్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న మిగ్-29 విమానాన్ని.. లాన్సెట్ డ్రోన్ అటాక్ చేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి మంగళవారం నుంచి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. క్రివోయ్ రోగ్ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న కోవియెట్ కాలం నాటి మిగ్-29 విమానాన్ని.. రష్యాకు చెందిన లాన్సెట్ కమికేజ్ డ్రోన్ పేల్చివేసింది. పేలోడ్‌ను ఎత్తుకెళ్లిన ఓ డ్రోన్.. దాన్ని ఆ మిగ్ ఆగి ఉన్న ఎయిర్‌బేస్‌పై వదిలింది. మిగ్ వద్ద పేలుడు జరిగిన దృశ్యాలను రెండో డ్రోన్ చిత్రీకరించింది.
MIG-29 at Krivoy Rog airport getting hit by a lancet.
Lol pic.twitter.com/b9SpPSEr98
— ayden (@squatsons) September 19, 2023
సాధారణంగా రష్యా ఎప్పుడూ లాన్సెట్ డ్రోన్లను వాడుతుంది. పశ్చిమ దేశాలకు చెందిన ట్యాంకులను ఈ డ్రోన్లు చాలా ఈజీగా అటాక్ చేస్తున్నాయి. అయితే తాజాగా డెవలప్ చేసిన లాన్సెట్ కమికేజ్ డ్రోన్ మరింత కలవరం పుట్టిస్తోంది. గతంలో ఉన్న రేంజ్‌ను దాటి ఇప్పుడు ఆ డ్రోన్ మరింత దూరం ముందుకు వెళ్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. లాన్సెట్ వర్షన్లో రెండు రకాల డ్రోన్లు ఉన్నాయి. చిన్నపాటి లాన్సెట్ డ్రోన్ .. కేజీ బరువున్న పేలోడ్‌ను.. 30 నిమిషాల పాటు మోసుకెళ్లగలదు. ఇక మరో వర్షన్ డ్రోన్ 3కేజీల బరువును.. 40 నిమిషాల పాటు మోసుకెళ్లగలదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

