ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం.. ఐక్యరాజ్యసమితి వార్నింగ్
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం వల్ల పేద దేశాల్లో ధరలు పెరిగాయని, దీంతో ఆహార అభద్రత ఏర్పడినట్లు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ప్రారంభం కాకుంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత ఏర్పడే ఛాన్సు ఉందన్నారు. రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల నౌకాశ్రయాలకు సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో పాటు గోధుమలు, మొక్కజొన్నలు, పప్పు దినుసులు అధిక మొత్తంలో సరఫరా అవుతాయి. అయితే పోర్టుల్లో నౌకలు స్తంభించడంతో.. ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాలు ధరలు దాదాపు 30 శాతం పెరిగినట్లు యూఎన్ తెలిపింది. పోషకాహార లోపం, కరువు, ఆకలిబాధలతో లక్షలాది మంది బాధపడుతారని గుటెర్రస్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో కావాల్సినంత ఆహారం ఉందని, ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించకుంటే, రాబోయే నెలల్లో గ్లోబల్ ఫుడ్ షార్టేజ్ ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో ఆహార ఉత్పత్తి మళ్లీ పెరగాలని, ఇంకా రష్యా, బెలారస్ నుంచి ఫెర్టిలైజర్లు కూడా అధిక మొత్తంలో మార్కెట్లోకి వస్తేనే ప్రపంచం గాడిలో పడుతుందని గుటెర్రస్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

