సినిమాలపై సెన్సార్ ఎత్తేసిన యూఏఈ

దుబాయ్: విదేశీయులను ఆకట్టుకునే ఉదారవాద ముద్రను మరింతగా పెంచుకునే చర్యల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా సినిమాల సెన్సార్‌ను మొత్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. సాంప్రదాయిక ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే అంశాలను సినిమాల నుంచి తొలగించే బదులుగా ‘21 ప్లస్’ అనే కొత్త వయోవర్గాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఎమిరేట్ మీడియా నియంత్రణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. యూఏఈ థియేటర్లలో అంతర్జాతీయ సినిమాలను యథాతథంగా ప్రదర్శించవచ్చని ట్విట్టర్లో పేర్కొన్నది. నగ్నత్వం, స్వలింగ సంపర్కం, లైంగిక దృశ్యాల వంటివి గతంలో యూఏఈలో సెన్సార్ చేసేవారు. ప్రతి పదిమందిలో తొమ్మిది మంది విదేశీయులే ఉండే యూఏఈలో అరబ్బు రాజ్యాలకు భిన్నమైన సంస్కరణలు చాలానే తెచ్చారు. అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లకు అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి శుక్రవారానికి బదులుగా శని, ఆదివారాల వారాంతపు సెలవులు కూడా అమలు చేయనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

