పేలిన అగ్నిపర్వతం.. ఆ దేశాలకు సునామీ హెచ్చరికలు..!
Tonga Volcano | పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం పేలిపోయింది. హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ

Tonga Volcano | పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం పేలిపోయింది. హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత భారీగా పొగ, బూడిద ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో టోంగాకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీలో దాదాపు 8 నిమిషాల పాటు.. పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు వినిపించాయి.
అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన ప్రాంతానికి 65 కిలోమీటర్ల దూరంలోని టోంగా రాజధాని నుకులోఫాలో 1.2 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. పశ్చిమ తీరానికి సునామీ హెచ్చరికలను అమెరికా వాతావరణ విభాగం జారీ చేసింది. సునామీ హెచ్చరికల దృష్ట్యా యూఎస్ పశ్చిమ తీరంలోని బీచ్‌లను మూసివేశారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. టోంగాలోని చర్చిని, అనేక నివాసాలను అలలు ముంచెత్తాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టోంగాలో లక్షా ఐదు వేల మంది నివసిస్తున్నారు. అయితే ఇక్కడ 2014లో సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించింది. 2015లోనూ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత విస్ఫోటనం కారణంగా.. టోంగాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే అంశంపై స్పష్టత లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

