Birmingham | లండన్, సెప్టెంబర్ 6: బ్రిటన్లోని రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ నగర బడ్జెట్లో మిలియన్ల పౌండ్ల లోటు ఏర్పడింది. దీంతో అత్యవసరం కాని అన్ని సేవల ఖర్చులను నిలిపివేస్తున్నట్టు బర్మింగ్హామ్ కౌన్సిల్ నేత జాన్ కాటన్, ఉప నేత శరోన్ థాంప్సన్ ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ మేరకు సెక్షన్ 114 నోటీసును జారీ చేశారు.
సమాన వేతన చెల్లింపుల బాధ్యతల నుంచి కూడా కౌన్సిల్ తప్పుకొన్నది. సమాన వేతన చెల్లింపులకు సంబంధించి నిధులలేమి కారణంగా సుమారు 650-750 బ్రిటిష్ పౌండ్ల స్టెర్లింగ్ చెల్లింపులు నిలిచిపోయాయి. యూకే సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2012 నుంచి బర్మింగ్హామ్ కౌన్సిల్ 1.1 బిలియన్ పౌండ్లను సమాన వేతన చెల్లింపుల కింద చెల్లించింది.