UK air traffic network failure | బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ నెట్వర్క్ వ్యవస్థలో లోపం.. గగనతలం మూసివేత
UK air traffic network failure | బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ (UK air traffic network failure) అయ్యింది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
లండన్: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ (UK air traffic network failure) అయ్యింది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టులు, విమానాల్లో చిక్కుకున్న ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు.
కాగా, సాంకేతిక సమస్య వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ పని చేయడంలేదని బ్రిటన్ జాతీయ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ఎన్ఏటీఎస్) ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ నేపథ్యంలో తమ సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు బ్రిటన్కు చెందిన పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. అయినప్పటికీ సేవలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసేందుకు ప్రయత్నినట్టు వెల్లడించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

