రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్లోని పలు నగరాలు శిధిలాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఉక్రేనియన్లు స్వదేశం వదిలి పారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్లో పెళ్లి గౌన్లు తయారు చేసు ప్రముఖ సంస్థ ‘మిల్లానోవా’ చేస్తున్న పని చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.
ఈ కంపెనీ ప్రస్తుతం ఉక్రేనియన్ దళాలకు అవసరమైన అసాల్ట్ వెస్టులు, మిలటరీ నెట్స్ తయారు చేస్తోంది. ఈ కంపెనీలో మొత్తం 600 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 98 శాతం మహిళలే కావడం గమనార్హం. ఈ ఉద్యోగులంతా దేశం కోసం చూపిస్తున్న తెగువకు మిల్లానోవా కంపెనీ సీఈవో ఇవానా కిర్చుక్ పేర్కొన్నారు.
‘‘పెళ్లి గౌన్లతోపాటు దేశాన్ని కాపాడే డిఫెండర్లు, వైద్యులకు కూడా దుస్తులు తయారు చేస్తున్నాం’’ అని కంపెనీ వెల్లడించింది. అలాగే ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులో కూడా దుస్తులు తయారు చేసి, వాటి ద్వారా వచ్చే డబ్బును ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం ఉపయోగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.