France president | ఉక్రెయిన్ యుద్ధం.. ఆసియా దేశాల సమస్య కూడా : ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్
ఈ యుద్ధం కారణంగా ప్రపంచమంతా అస్థిరత నెలకొనే అవకాశం ఉంది
ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆసియా దేశాల సమస్య కూడా అని శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ అన్నారు. కాబట్టి ఆసియా దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఒక అంగీకారానికి రావాలని ఆయన కోరారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో-ఆపరేషన్ సదస్సుకి మక్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపార వేత్తలతో మక్రాన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం అనేది యూరోపియన్ దేశాల సమస్య మాత్రమే కాదు. ఆసియా దేశాల సమస్య కూడా. ఎందుకంటే..ఈ యుద్ధం కారణంగా ప్రపంచమంతా అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. అందుకని ఉమ్మడి అంగీకారం కోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైన్యం, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఇరువైపులా లక్షల్లో సైనికులు చనిపోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూరప్‌లో అతిపెద్ద శరణార్థుల సంక్షోభానికి దారి తీసింది. ఉక్రెయినపై రష్యా దాడిని ఐక్యరాజ్యసమితి ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే.. ఈమధ్యే జీ 20 సదస్సు జరుగుతుండగానే రష్యా ఉక్రెయిన్ మీద క్షిపణుల వర్షం కురిపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

