ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో వంద రోజులు..
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి నేటితో వంద రోజులైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ యుద్ధానికి సన్నద్దమై ఉండాలని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. ఇది ఎన్నటికీ ముగియని యుద్ధంగా మారుతున్నట్లు ఆయన అన్నారు. ఇక తూర్పు డాన్బాస్ ప్రాంతంలో రష్యా వ్యూహాత్మక విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. కానీ ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకున్నట్లు బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం వరకు ప్రస్తుతం రష్యా సైనిక దళాల ఆధీనంలో ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
సివరొడొనస్కీ సిటీలో తీవ్రంగా యుద్ధం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భూభాగం రష్యా దళాల ఆధీనంలోనే ఉన్నది. గురువారం వైట్‌హౌజ్‌లో అధ్యక్షుడు జోబైడెన్‌తో భేటీ అయిన తర్వాత నాటో చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు నిత్యం సపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎందుకంటే ఆ యుద్ధం సుదీర్ఘంగా మారుతున్నట్లు ఆయన చెప్పారు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ భారీ త్యాగాలకు పాల్పడుతోందని, మరో వైపు రష్యా కూడా ఎక్కువ సంఖ్యలో సైనికుల్ని కోల్పోతున్నట్లు జెన్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Nato Chief
- Putin
- Russia
- Stoltenberg
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

