మాస్కో: రష్యాలోని జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్(Nuclear Power Plant) వద్ద ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది. అణు ప్లాంట్ వద్ద ఉన్న డీజిల్ ట్యాంకుల సమీపంలో ఉక్రెయిన్ బాంబులు జారవిడిచినట్లు తెలుస్తోంది. బాంబు దాడితో భారీగా అగాధం ఏర్పడినట్లు ఆ ప్లాంట్ డైరెక్టర్ యూరీ చెర్నుక్ తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్ జార విడిచిన పేలుడు పదార్ధం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాలను ఓ వ్రాపర్లో పెట్టి వదిలారు. ప్లాంట్ ఫెన్సింగ్‌కు కేవలం 5 మీట్లర దూరంలో ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంక్‌లు ఉన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్లాంట్ కోసం బ్యాకప్ డీజిల్ జనరేటర్లను వినియోగిస్తుంటారు.పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్తు నిలిచిపోయిన సమయంలో జనరేటర్లను ఆన్ చేస్తుంటారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత జపరోజియా ప్లాంట్ వద్ద బ్లాకౌట్లు తరుచు జరుగుతున్నాయి.