రష్యా ఆయుధాగారంపై ఉక్రెయిన్ సైన్యం దాడి..
Ukraine | ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనేఉన్నది. తమ రాజధాని కీవ్‌పై పుతిన్ సేనలు బాంబులతో విరుచుకు పడిన నాలుగు రోజుల తర్వాత ఆ దేశానికి చెందిన ఆయుధాగారంపై ఉక్రెయిన్ బలగాలు
కీవ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనేఉన్నది. తమ రాజధాని కీవ్‌పై పుతిన్ సేనలు బాంబులతో విరుచుకు పడిన నాలుగు రోజుల తర్వాత ఆ దేశానికి చెందిన ఆయుధాగారంపై ఉక్రెయిన్ బలగాలు దాడులు చేశాయి. దీంతో భారీ పేలుళ్లతో ఆయుధాగారం ధ్వంసమైపోయింది. రష్యా సరిహద్దుల్లోని బెల్గరోడ్ రీజియన్‌లో ఉన్న ఓ గ్రామంలో ఉన్న ఆయుధ డిపోపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణులతో దాడికి పాల్పడిందని గవర్నర్ వ్యచెస్లేవ్ గ్లాడ్కోవ్ తెలిపారు.

దీంతో ఆ ప్రాంతంలో భారీ శబ్ధంతో కూడిన మంటలు ఎగసిపడ్డాయని, ఆయుధ డిపో ధ్వంసమైందని చెప్పారు. బెల్గరోడ్లోని నివాస సముదాయాలపై కూడా ఉక్రెయిన్ బలగాలు బాంబులు విసిరాయని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ సైన్యం తోసిపుచ్చింది. కాగా, నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. బాంబుల మోతతో కీవ్‌లోని షెవ్చెంకో ప్రాంతం దద్దరిల్లింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

