UK Submarine : హర్మూజ్ జలసంధి (Strait of Harmuz) వద్ద ఇరాన్ (Iran) ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే పిలుపునిచ్చారు. అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా శత్రుదేశాల వాణిజ్య నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ ఈవిధంగా అప్పీల్ చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బ్రిటన్‌కు చెందిన అణు జలాంతర్గామి ‘హెచ్ఎంఎస్ ఆన్సన్’ హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. దీనిని ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొన్నది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పడోలు, శక్తిమంతమైన ఆయుధ సంపత్తి ఉన్నట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాలిస్తే ఇరాన్‌పై బ్రిటన్ దళాలు దాడులు చేయవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.