రోజూ ఇంట్లో తినే తిండి బోర్ కొట్టి అప్పుడప్పుడూ దగ్గర్లోని రెస్టారెంట్లకు వెళ్తుంటాం. ట్రైన్ ప్లాట్‌ఫాం, జైలు వంటి వైవిధ్యమైన ఐడియాలతో చాలా రెస్టారెంట్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే అంతకుమించి అన్నట్టు డచ్ కంపెనీ ‘యూ బోట్ వొర్ఎక్స్’ ఓ సబ్‌మెరైన్‌ను రూపొందిస్తున్నది. ఇందులో 150 చదరపు మీటర్ల స్థలం ఉంది. రెస్టారెంటుతో పాటు అనేక వసతులను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా నీటిలో 200 అడుగుల లోతుకు వెళ్లి అలా లంచ్‌కో.. డిన్నర్‌కో వెళ్లి సరదాగా గడిపేసి రావొచ్చు. నీటిలోని జీవచరాలను చూసి ఆనందించేందుకు 14 కిటీకిలు ఏర్పాటు చేయనున్నది.