నౌకపై దాడి.. ఇద్దరు భారతీయుల గల్లంతు
హొర్ముజ్ జలసంధిలో ఎంటీ పెట్రో డాల్ఫిన్ నౌకపై ఆదివారం దాడి జరిగింది. ఇందులో 11 మంది భారతీయ నావికులున్నారు. 9 మందిని రక్షించగా ఇద్దరు గల్లంతయ్యారు. ఒమన్‌లోని సోహార్ నౌకాశ్రయం సమీపంలో నికరగువ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై డ్రోన్ దాడి జరిగినట్టు సమాచారం. గల్లంతైన వారి కోసం స్థానిక సంస్థలతో కలిసి గాలిస్తున్నట్టు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
టెహ్రాన్: హొర్ముజ్ జలసంధిలో ఎంటీ పెట్రో డాల్ఫిన్ నౌకపై ఆదివారం దాడి జరిగింది. ఇందులో 11 మంది భారతీయ నావికులున్నారు. 9 మందిని రక్షించగా ఇద్దరు గల్లంతయ్యారు. ఒమన్‌లోని సోహార్ నౌకాశ్రయం సమీపంలో నికరగువ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై డ్రోన్ దాడి జరిగినట్టు సమాచారం. గల్లంతైన వారి కోసం స్థానిక సంస్థలతో కలిసి గాలిస్తున్నట్టు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మరోవైపు మార్షల్ ఐస్లాండ్ జెండాలతో ప్రయాణిస్తున్న ఎంటీ వాల్దెరా నౌకపై కూడా క్షిపణి దాడి జరిగిందని తెలుస్తున్నది. ఆ నౌకలోనూ 11 మంది భారత నావికులున్నారని, వారి భద్రతపై ఆరా తీస్తున్నట్టు కేంద్రమంత్రి సర్బానంద వెల్లడించారు. ఈ దాడులకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌర నౌకలు, ఇంధన నౌకలపై దాడులను నిలిపివేయాలని సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

