లండన్: ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం తీవ్ర కుదుపులకు గురి కావడంతో 12 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. దోహా నుంచి డబ్లిన్‌కు వెళ్తున్న క్యూఆర్017 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గాయపడ్డవారిని దవాఖా నలకు తరలించారు. కాగా, ఐదు రోజుల క్రితం లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానంలో కూడా ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకోగా, ఒక ప్రయాణికుడు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు.