Turbulence in Qatar Airways | ఖతార్ విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
Turbulence in Qatar Airways | ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ సంఘటనలో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 12 మంది గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించారు.
దోహా: ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం భారీ కుదుపులకు గురైంది. (Turbulence in Qatar Airways) ఈ సంఘటనలో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 12 మంది గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించారు. ఆదివారం మధ్యాహ్నం ఖతార్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్017 విమానం ఆ దేశ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌కు బయలుదేరింది. అయితే టర్కీ గగనతలంపై ఎగురుతుండగా ఆ విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ సంఘటనలో ఆరుగురు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులతో సహా 12 మంది గాయపడ్డారు.
కాగా, ఆ విమానం డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే అత్యవసర సేవలు అందించినట్లు ఆ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఫైర్, రెస్క్యూ సిబ్బంది ఆ విమానం వద్దకు చేరుకున్నారని చెప్పారు. విమానంలో భారీ కుదుపుల వల్ల గాయపడిన 12 మందికి చికిత్స అందించినట్లు వివరించారు. అలాగే ఆ విమానంలో ప్రయాణించిన వారందరికీ పూర్తి సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ఐదు రోజుల కిందట లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం కూడా భారీ కుదుపులకు గురైంది. ఈ సంఘటనలో ఒక ప్రయాణికుడు మరణించగా 12 మందికిపైగా గాయపడ్డారు.
13.30 update: ✈️
Qatar Airways flight QR017 from Doha landed safely as scheduled at Dublin Airport shortly before 13.00 on Sunday. Upon landing, the aircraft was met by emergency services, including Airport Police and our Fire and Rescue department, due to 6 passengers and 6… pic.twitter.com/nB2F4BOcI5
— Dublin Airport (@DublinAirport) May 26, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

