Donald Trump : ఫిఫా వరల్డ్‌కప్‌లో జోక్యం చేసుకున్నందుకు తనపై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ప్రపంచకప్‌లో రెడ్ కార్డుతో ఒక మ్యాచ్ నిషేధానికి గురవ్వాల్సిన యూఎస్ఏ ఆటగాడు ఫొలారిన్ బలోగన్( Folarin Balogun)ను కాపాడిన ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. నేను సమీక్ష మాత్రమే కోరాను. ఫిఫా యాజమాన్యాన్ని ఆదేశించలేదు అని ఆయన పేర్కొన్నారు. అనంతరం బలోగన్‌పై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తేయడాన్ని ట్రంప్ స్వాగతించారు.
నాకౌట్ మ్యాచ్‌లతో రసవత్తరంగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 32వ రౌండ్లో ప్రత్యర్థి ఆటగాడు గాయపడేందుకు కారణమైన అమెరికా ప్లేయర్ ఫొలారిన్ బలోగన్‌పై నిషేధాన్ని ఫిఫా వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నారంతా. అయితే.. ట్రంప్ మాత్రం తానేమీ తప్పు చేయలేదని, సమీక్ష మాత్రమే కోరానని సమర్ధించుకున్నారు.
Trump: “I didn’t know what the hell a red card was. When I found out, I said, ‘You gotta be kidding!'” pic.twitter.com/SsTrMwLVDg
— Open Source Intel (@Osint613) July 6, 2026
‘నేను చేసిందల్లా సమీక్ష కోరడమే. ఎందుకంటే బలోగన్ పొరపాటు చేశాడని నాకు అనిపించలేదు’ అని ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు.. రిఫరీని దుర్మార్గుడిగా పేర్కొన్న అమెరికా అధినేత.. బలోగన్‌పై నిషేధం ఎత్తివేసి సరైన నిర్ణయం తీసుకున్న ఫిఫాకు ధన్యవాదాలు తెలిపారు. రెడ్ కార్డ్‌ను వెనక్కి తీసుకోవడం ద్వారా అతిపెద్ద అన్యాయాన్ని అడ్డుకున్నారని ట్రుత్ వేదికగా ట్రంప్ వెల్లడించారు.
బోస్నియా హర్జెగొవినాపై 32వ రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏ 2-0తో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో డిఫెండర్ తారిక్ ముహరెమోవిక్ తీవ్రంగా గాయపడడంలో బలోగన్ పాత్ర ఉందని భావించిన రిఫరీ అతడికి రెడ్ కార్డు చూపించాడు. దాంతో, ఫిఫా నిబంధనల ప్రకారం బలోగన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. కానీ, డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో.. ఫిఫా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. బెల్జియంతో 16వ రౌండ్ మ్యాచ్ ఆడేందుకు బలోగన్‌ను అనుమతించింది.
NEW: President Trump personally called FIFA President Gianni Infantino to ask him to review the suspension of U.S. player Folarin Balogun, according to the NYT.
Balogun was given a red card against Bosnia and Herzegovina on Wednesday and was suspended for the next game.
FIFA… pic.twitter.com/svJl6f4N3g
— Collin Rugg (@CollinRugg) July 5, 2026