యూకే యూనివర్సిటీల్లో చదువు మరింత భారం.. ఏటా పెరుగనున్న ట్యూషన్ ఫీజు
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి చేదువార్త. ఇకపై అక్కడి చదువు మరింత భారం కాబోతున్నది. యూకే యూనివర్సిటీల్లో ఇకపై ట్యూషన్ ఫీజులు ఏటా పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ట్యూషన్ ఫీజును పెంచడమనే కొత్త విధానాన్ని వర్సిటీలు అమలుజేయబోతున్నాయి. 2026 నుంచి ఇది అమల్లోకి రాబోతున్నట్టు బ్రిటన్ విద్యామంత్రి ఫిలిప్సన్ ఆదేశ ఎంపీలకు వివరించారు.
లండన్: ఉన్నత చదువుల కోసం బ్రిటన్ (Britain) వెళ్లాలనుకునే వారికి చేదువార్త. ఇకపై అక్కడి చదువు మరింత భారం కాబోతున్నది. యూకే యూనివర్సిటీల్లో ఇకపై ట్యూషన్ ఫీజులు ఏటా పెరగబోతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ట్యూషన్ ఫీజును పెంచడమనే కొత్త విధానాన్ని వర్సిటీలు అమలుజేయబోతున్నాయి. 2026 నుంచి ఇది అమల్లోకి రాబోతున్నట్టు బ్రిటన్ విద్యామంత్రి ఫిలిప్సన్ ఆదేశ ఎంపీలకు వివరించారు.
త్వరలో చట్టాన్ని తీసుకొస్తున్నామని, వర్సిటీలు, కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ఈ సంస్కరణలు చేపడుతున్నట్టు మంత్రి చెప్పారు. ‘కోర్సుల ఫీజును వర్సిటీలే నిర్ణయిస్తాయి. అత్యధిక ఫీజు నిర్ణయించే హక్కు వాటికుంది’ అని ఫిలిప్సన్ అన్నారు. గత 8 ఏండ్లలో మొదటిసారి సెప్టెంబర్‌లో ట్యూషన్ ఫీజును 9,535 యూరోలకు పెంచారు. అయినప్పటికీ అదనంగా ఆర్థిక మద్దతు లేకుండా 43% యూనివర్సిటీలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

