వాషింగ్టన్: ఇరాన్‌పై మిలిటరీ దాడులు చేస్తూనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పదేపదే బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇరాన్‌కు చెందిన విద్యుత్తు ప్లాంట్లు, బ్రిడ్జ్‌లను ధ్వంసం చేస్తానన్నారు. ఓ దశలో ఇరాన్ నాగరికతను రాత్రికి రాత్రే నామరూపాలు లేకండా చేస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్ ట్రంప్‌ను ప్రశ్నించారు. ఇరాన్‌పై అణు బాంబుతో దాడి చేయాలనుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలివితక్కువ ప్రశ్న వేస్తున్నారని ఆ రిపోర్టర్‌ను ఆయన తిట్టారు. వైట్‌హౌజ్‌లో గురువారం మీడియాతో ట్రంప్ మాట్లాతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
రిపోర్టర్ వేసిన ప్రశ్న ట్రంప్‌ను అసహనానికి గురిచేసింది. ఒకవేళ ఇరాన్ తమ షరతులకు అంగీకరించకుంటే ఆ దేశ నాగరికతను అంతం చేస్తానన్నారు కాదా, మరి మీరు ఆ దేశంపై అణు దాడి చేయాలని భావించారా అని ఆమె ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ఇలాంటి స్టుపిడ్ ప్రశ్న ఎందుకు అడుగుతారని అన్నారు. నేనెందుకు న్యూక్లియర్ వెపన్ వాడుతానని, తాము సంప్రదాయబద్దంగా, సంపూర్ణంగా ఇరాన్‌ను నిర్వీర్యం చేశామన్నారు. తానేమీ ఇరాన్‌పై అణు బాంబును వాడబోనన్నారు. న్యూక్లిర్ వెపన్‌ను మరే దేశం కూడా వాడకుండా చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
ఒకవేళ ఇరాన్ మళ్లీ ఆయుధాలు సమర్చుకోవాలని ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని ఒక్క రోజులోనే నాశనం చేయనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో కావాలంటే ఇప్పుడే డీల్ చేసుకోవచ్చు అని, కానీ తాము చేసుకోబోయే డీల్ ఎప్పటికీ నిలిచేలా ఉండాలన్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదన్నారు.
.@POTUS to Jim Acosta’s girlfriend (@ElizLanders) when she asks one of the dumbest questions ever — if he’d use a nuclear weapon on Iran:
“Why would a stupid question like that be asked?… No, I wouldn’t use it. A nuclear weapon should never be allowed to be used by anybody.” pic.twitter.com/U235920fwD
— Rapid Response 47 (@RapidResponse47) April 23, 2026