Donald Trump : పశ్చిమాసియా (West Asia) లో ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. హర్మూజ్ (Hormuz) దిగ్బంధనం, ఇరాన్ (Iran) తో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ సిచ్యువేషన్ రూమ్ (Situation Room) లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance), విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), రక్షణ మంత్రి పీట్హెగ్సెత్ సహా ఉన్నతస్థాయి సిబ్బంది ఈ భేటీకి హాజరయ్యారు.
హర్మూజ్‌లో ఆటంకం లేని ప్రయాణానికి, అణు డిమాండ్లకు అంగీకరించేలా ఇరాన్‌పై ఒత్తిడి తేవడం కోసం దాడులకు ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌పై దాడుల వేళ, గతంలో కీలక ఆపరేషన్ల సమయంలో ఈ గది నుంచే అమెరికా అధ్యక్షులు పర్యవేక్షించారు. వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్ బేస్మెంట్లో ఈ సిచ్యువేషన్ రూమ్ ఉంది.
దాదాపు 5,525 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ గదిలో కాన్ఫరెన్స్ రూమ్, ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ సెంటర్ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు, ఆయన సలహాదారులు దేశం లోపల, బయట సంక్షోభ సమయాల్లో పరిస్థితులను సమీక్షించడానికి ఇక్కడ సమావేశమవుతారు.