Donald Trump: ఖరీదైన విదేశీ గిఫ్ట్‌లు ఎక్కడ ? ట్రంప్‌ను నిలదీసిన కాంగ్రెస్ కమిటీ
Donald Trump : ట్రంప్ గిఫ్ట్‌ల గురించి ఆరా తీస్తున్నారు. విదేశీ నేతలు ఇచ్చిన గిఫ్ట్‌లు ఆచూకీ లేవు. దీంతో ఆ గిఫ్ట్‌లను ఆయన ఎక్కడ దాచారన్న కోణంలో కాంగ్రెస్ కమిటీ దర్యాప్తు చేస్తోంది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్(Donald Trump)కు విదేశీ నేతల నుంచి భారీగా గిఫ్ట్(Gifts)లు అందుకున్నారు. ఆ బహుమతుల విలువ సుమారు రెండున్నర లక్షల డాలర్లు ఉంటుందని డెమోక్రటిక్ కాంగ్రెస్ కమిటీ(Congress Committee) అంచనా వేసింది. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణికి కూడా ఆ కానుకలు అందాయి. అయితే భారత ప్రధాని మోదీతో పాటు ఆ నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇచ్చారు. ఇక వాటి విలువ సుమారు 47 వేల డాలర్లు ఉంటుందని కమిటీ తెలిపింది. విదేశాల నుంచి అందిన అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ల వివరాలను ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయలేదని కమిటీ తన రిపోర్టులో ఆరోపించింది. సౌదీ స్వార్డ్స్, ఇండియన్ జ్వలరీ, సాల్వడార్ ట్రంప్ పోట్రైట్ అన్న టైటిల్‌తో రిపోర్టును రిలీజ్ చేశారు.
ఫారిన్ గిఫ్ట్స్ అండ్ డెరేషన్ యాక్టు(Foregin Gifts and Decorations Act) ప్రకారం ట్రంప్‌పై చర్యలు చేపట్టారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ దేశాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అయితే మిస్సైన ఆ భారీ గిఫ్ట్‌లు ఎక్కడ ఉన్నాయన్న కోణంలో కమిటీ దర్యాప్తు చేస్తోంది. విదేశాంగ విధానం(Foreign Policy)లో భాగంగా వివిధ దేశాధినేతలు ట్రంప్‌కు గిఫ్ట్ ఇచ్చారా లేదా అన్న కోణంలో విచారణ జరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత జేమీ రాస్కిన్ తెలిపారు.
ట్రంప్ ఫ్యామిలీ(Trump Family)కి సుమారు వందకుపైగా విదేశీ గిఫ్ట్‌లు అందాయి. వాటి విలువ సుమారు 25 మిలియన్ల డాలర్లు ఉంటుంది. రిపోర్టులో ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం.. ట్రంప్‌కు ఇండియా నుంచే దాదాపు 17 ఖరీదైన గిఫ్ట్‌లు అందినట్లు తెలుస్తోంది. ఇండియా నుంచి వచ్చిన గిఫ్ట్‌ల మొత్తం విలువ 47 వేల డాలర్లు ఉంటుందట. దాంట్లో యోగి ఇచ్చిన 8500 డాలర్ల విలువైన ఫ్లవర్ వాస్(Vase)తో పాటు 4600 డాలర్ల విలువైన తాజ్ మహల్ ప్రతిమ, రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన 6600 డాలర్ల విలువైన రగ్గు ఉన్నాయి. ప్రధాని మోదీకూడా 1900 డాలర్ల విలువైన కఫ్లింక్ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

