యూరప్ నుంచి బలగాల ఉపసంహరణ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన
ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో కూటమి దేశాల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరప్ నుంచి తమ బలగాలను ఉపసంహరించే ఆలోచన చేస్తున్నట్టు వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 10 : ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో కూటమి దేశాల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూరప్ నుంచి తమ బలగాలను ఉపసంహరించే ఆలోచన చేస్తున్నట్టు వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇరాన్‌తో యుద్ధంతోపాటు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన ఆకాంక్షల పట్ల నాటో దేశాలు తనకు మద్దతునివ్వకపోవడం పట్ల ట్రంప్ కినుక వహించారు. ముఖ్యంగా ఇరాన్ కబ్జాలో ఉన్న హొర్ముజ్ జలసంధిని తెరిపించే విషయంలో నాటో కూటమి వైఫల్యంపై ట్రంప్ మండిపడుతున్నారు.
మరోవైపు నాటో దేశాల కారణంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న తన కల నెరవేరకపోవడంపై కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐరోపా ఖండం నుంచి అమెరికన్ బలగాల ఉపసంహరణపై తన సలహాదారులతో సంప్రదించినట్టు ఆ అధికారి తెలిపారు. ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, పెంటగాన్ కూడా బలగాల ఉపసంహరణకు ఎటువంటి పటిష్ఠమైన ప్రణాళికను రూపొందించలేదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

