Charlie Kirk : అమెరికాలో సంచలనం సృష్టించిన తన సన్నిహితుడు చార్లీ కిర్క్ (Charlie Kirk) హత్యపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తమ దేశ యువత మనసును చార్లీ కంటే గొప్పగా మరెవరూ అర్ధం చేసుకోలేరని పేర్కొన్న ట్రంప్ .. కిర్క్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్టు ప్రకటించారు. మరణాంతరం కిర్క్‌కు ‘ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ (President Medal Of Freedom) గౌరవం కల్పిస్తున్నట్టు గురువారం ప్రెసిడెంట్ వెల్లడించారు. అమెరికా సమాజం కోసం, దేశ ప్రయోజనాల కోసం కృషి చేసిన పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమే ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్.
‘తన తరంవాళ్లలో చార్లీ ఒక యోధుడు. స్వేచ్ఛ కోసం పోరాడిన ఛాంపియన్. అమెరికాలోని లక్షలాది మందికి అతడు స్ఫూర్తి. అతడిని మనం ఎంతగానో మిస్ అవుతాం. చార్లీ మరణించినప్పటికీ అతడి మాటలు.. అతడిచ్చిన ధైర్యం కోట్లాదిమంది గుండెల్లో, ముఖ్యంగా యువత హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
“I am pleased to announce that I will soon be awarding Charlie Kirk, posthumously, the Presidential Medal of Freedom.” – President Donald J. Trump pic.twitter.com/RGdyImmNJZ
— The White House (@WhiteHouse) September 11, 2025
రిపబ్లికన్ పార్టీలో కీలకమైన నేతగా పేరున్న చార్లీ కిర్క్ అధ్యక్షుడు ట్రంప్‌కు సన్నిహితుడు. ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో ట్రంప్ విజయానికి పాటుపడినందున ఆయన కుటుంబసభ్యులతో చార్లీకి సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికా యువతలో విలువల్ని పెంపొందించేందుకు ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ'(Turning Point USA) అనే సంస్థను స్థాపించారు చార్లీ. కాలేజీ క్యాంపస్‌లు, స్కూళ్లలో ఈ సంస్థ ద్వారా చార్లీ పలు కార్యక్రమాలు చేపట్టారు.
Charlie Kirk is a father and a husband. He is a human. I don’t care if you politically disagree with him nothing justifies this sick act. pic.twitter.com/FuygHfLRdm
— kira 👾 (@kirawontmiss) September 10, 2025
సెప్టెంబర్ 10న అలానే ఉతాహ్ వ్యాలీ యూనివర్సిటీలో ఒక ఈవెంట్ నిర్వహించారు చార్లీ. దురదృష్టవశాత్తూ ఈ కార్యక్రమం జరుగుతుండగానే ఆయనను దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ హంతకుడు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ప్రధాన నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.