Trump’s New Policy | విదేశీ విద్యార్థుల లక్ష్యంగా.. ట్రంప్ కొత్త విధానం
Trump's New Policy | అక్రమ వలసలను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త వ్యూహాలు పన్నుతున్నది. భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతున్నది.
వాషింగ్టన్: అక్రమ వలసలను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త వ్యూహాలు పన్నుతున్నది. భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా వారిని అమెరికా నుంచి త్వరగా పంపేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. (Trump’s New Policy) ఒక విద్యార్థి వీసా రద్దు అయినప్పటికీ అమెరికాలో చదువు పూర్తి చేసేందుకు, వారు అక్కడ ఉండేందుకు ఇప్పటి వరకు అనుమతిస్తున్నారు. అయితే అమెరికాను వీడితే తిరిగి ప్రవేశించలేరు.
కాగా, విద్యార్థి వీసా రద్దైన వెంటనే అమెరికా నుంచి వెంటనే బహిష్కరించే కొత్త విధానాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించింది. తక్కువ వ్యవధిలో వీసాలు రద్దైన కొంత మంది విద్యార్థులు అమెరికాలోని కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసుల విచారణ సందర్భంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త విధానం వెలుగులోకి వచ్చింది. ఏదైనా కారణం చేత ఒక విద్యార్థి వీసాను రద్దు చేస్తే అమెరికాలో చదువు అవకాశాన్ని లేదా ఉద్యోగాన్ని కొనసాగించే హక్కును కోల్పోతారు.
మరోవైపు విద్యార్థులు ఏ తప్పు చేయనప్పటికీ వారిని నేరస్తులుగా పరిగణిస్తారు. క్రిమినల్ డాటాలో వారి పేర్లు ఉంచుతారు. ఆ విధంగా విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేసి దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తామని ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారాన్ని ఆ మేరకు విస్తరిస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్నట్లు బాధిత విద్యార్థుల తరుఫు న్యాయవాది వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

