Train Hijack: రైలు హైజాక్ ఘటనలో 27 మంది ఉగ్రవాదులు హతం
Train Hijack: జాఫర్ రైలు హైజాక్ ఘటనలో.. 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155 మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చివరి మిలిటెంట్ హతమయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
బలోచిస్తాన్: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్లో జాఫర్ రైలును హైజాక్(Train Hijack) చేసిన ఘటనలో.. 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155 మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద ఆ రైలును దుండగులు అడ్డుకున్నారు. ట్రాక్‌ను పేల్చి.. డ్రైవర్‌ను షూట్ చేసి రైలును ఆపిన విషయం తెలిసందే. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్వెట్టా నుంచి పెషావర్ రైలు బయలుదేరిన సమయంలో దాంట్లో సుమారు 450 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. తాజా ఆపరేషన్‌లో పది మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. చివరి మిలిటెంట్‌ను హతమార్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
పంజాబ్, సింధ్ ప్రాంతాల నుంచి బలోచిస్తాన్ వెళ్లే అన్ని రైళ్లను రెస్క్యూ ఆపరేషన్ వల్ల రద్దు చేసినట్లు పాకిస్థాన్ రైల్వే శాఖ పేర్కొన్నది. ఇవాళ ఉదయం జాఫర్ రైలు నుంచి 57 మంది ప్రయాణికుల్ని రెస్క్యూ చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. వాళ్లను క్వెట్టాకు తరలించారు. ఇక మరో 23 మంది ప్రయాణికుల్ని మాచ్‌కు పంపించారు. భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక, మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయారని అధికారులు తెలిపారు.
దాడికి పాల్పడిన వ్యక్తులు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. కొండలు, లోయ ప్రాంతాలు కావడంతో.. రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్లడానికి భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేందుకు మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న మాస్టర్‌మైండ్‌తో రైలు హైజాక్ నిందితులు టచ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బాంబులతో రైల్వే ట్రాక్‌ను పేల్చిన తర్వాత.. మస్కఫ్ టన్నెల్‌కు సమీపంలో రైలు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో రైలును ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

