Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
గెలాక్సీ ఏఐ వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించే లక్ష్యంతో శాంసంగ్ కొత్త ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ వ్యవస్థను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వన్ యూఐ 9.5 బీటా వెర్షన్ కోడ్‌లో శాంసంగ్ ప్రైవేట్ ఏఐ క్లౌడ్ (SPAC)కి సంబంధించిన వివరాలు బయటపడడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది.
Samsung | గెలాక్సీ ఏఐ వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించే లక్ష్యంతో శాంసంగ్ కొత్త ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ వ్యవస్థను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వన్ యూఐ 9.5 బీటా వెర్షన్ కోడ్‌లో శాంసంగ్ ప్రైవేట్ ఏఐ క్లౌడ్ (SPAC)కి సంబంధించిన వివరాలు బయటపడడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది.
గెలాక్సీ ఏఐకి కొత్తగా ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ..
శాంసంగ్ తన గెలాక్సీ ఏఐ సేవల్లో వినియోగదారుల గోప్యత, భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కొత్త ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన వన్ యూఐ 9.5 బీటా వెర్షన్ ఈ నెల ప్రారంభంలో విడుదలైంది. ఈ వెర్షన్ ఏపీకే కోడ్‌ను పరిశీలించిన ఆండ్రాయిడ్ అథారిటీ, శాంసంగ్ కొత్తగా SPAC అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిని శాంసంగ్ ప్రైవేట్ ఏఐ క్లౌడ్‌గా పిలుస్తున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏఐ వినియోగదారులు పంపే ప్రశ్నలు, అభ్యర్థనలను ప్రత్యేక క్లౌడ్ సర్వర్లలో ప్రాసెస్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో ఆర్కేన్ అనే సర్వర్ ఆధారిత గేట్వేతోపాటు టోకెన్, ఐడెంటిటీ, మోసాల గుర్తింపు సేవలు కూడా ఉండనున్నట్లు నివేదిక పేర్కొంది.
భద్రతా దశలను దాటాకే ప్రాసెసింగ్..
ఈ కొత్త వ్యవస్థలో గెలాక్సీ ఏఐ అభ్యర్థనలు పలు భద్రతా దశలను దాటిన తర్వాతే ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వినియోగదారుల ప్రశ్నలను థర్డ్ పార్టీ రిలే ద్వారా పంపించడం వల్ల అభ్యర్థనలను పర్యవేక్షించగలిగినా, వాటి అసలు మూలాన్ని గుర్తించడం సాధ్యం కాకుండా ఉంటుందని సమాచారం. డేటాను పంపించే ముందు శాంసంగ్ సర్వర్లు అసలైనవేనా, వాటి సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి మార్పులు జరిగాయా అనే అంశాలను స్మార్ట్‌ఫోన్ ధ్రువీకరిస్తుంది. సర్వర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన రికార్డులను బహిరంగంగా పరిశీలించగలిగే విధంగా ఉంచనున్నట్లు, వాటిని రహస్యంగా మార్చడం సాధ్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే వినియోగదారుల వ్యక్తిగత గుర్తింపును వెల్లడించకుండా గెలాక్సీ పరికరం అసలైనదేనని నిర్ధారించేందుకు వన్‌టైమ్ అనామక పాస్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. అన్ అటెస్టెడ్ అనే మరో మోడ్ ప్రస్తావన కూడా కోడ్‌లో కనిపించిందని, ఇది శాంసంగ్ అంతర్గత పరీక్షల కోసం ఉద్దేశించి ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
గెలాక్సీ ఏఐ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సైతం..
మరోవైపు, శాంసంగ్ ఎస్పీఏసీ ఎస్డీకేలో గెమ్మా 4 ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్, క్యూవెన్ 3.6 ఏజెంటిక్ మోడల్, ఫ్లక్స్.2 ఇమేజ్ జనరేషన్ మోడల్ ప్రస్తావనలు కూడా కనిపించాయి. ఫోటో ఎడిటర్, ఇంటెల్లివాయిస్ సర్వీస్, స్మార్ట్ క్యాప్చర్, ఫోటో రీమాస్టర్ సర్వీస్ వంటి నాలుగు యాప్‌లలోనూ ఈ కొత్త వ్యవస్థకు సంబంధించిన సూచనలు గుర్తించారు. గతంలో యాపిల్ తన యాపిల్ ఇంటెలిజెన్స్ సేవల కోసం ప్రవేశపెట్టిన ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ విధానాన్ని పోలి శాంసంగ్ ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గెలాక్సీ ఏఐ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు గత నివేదికలు వెల్లడించాయి. ఇందులో సాధారణ ప్లాన్‌తో పోలిస్తే నాలుగు రెట్లు అధిక వినియోగ పరిమితి, అదనపు ఫీచర్లు అందించే అవకాశం ఉంది. అయితే ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ వ్యవస్థ, కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లపై శాంసంగ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

