లిజ్ ట్రస్ ఫోన్.. రష్యా హ్యాక్!
ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ చిక్కుల్లో పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోన్‌ను రష్యా హ్యాక్ చేసినట్టు స్థానిక పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
లండన్, అక్టోబర్ 30: ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్‌ట్రస్ చిక్కుల్లో పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోన్‌ను రష్యా హ్యాక్ చేసినట్టు స్థానిక పత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. లిజ్ ట్రస్ యూకే విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు రష్యా గూఢాచారులు ఈ హ్యాక్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని లిజ్ ట్రస్ ప్రధాని పదవి చేపట్టాక గుర్తించారు. మిత్రదేశాలతో చర్చలకు సంబంధించిన కీలక రహస్యాలు రష్యా చేతిలో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పలువురు విదేశాంగ మంత్రులతో లిజ్‌ట్రస్ జరిపిన సంభాషణలు, ఆయుధ సరఫరా రహస్యాలు కూడా పుతిన్ చేతికి చిక్కినట్టు అనుమానిస్తున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్, సివిల్ సర్వీస్ హెడ్ రహస్యంగా ఉంచారు. అయితే, భద్రతా ఏర్పాట్లపై వ్యాఖ్యానించేందుకు యూకే ప్రభుత్వ అధికార ప్రతినిధి నిరాకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Liz Truss
- phone hack
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

