వాషింగ్టన్: ఖర్చుల భారం తగ్గించుకోవడం, రీస్ట్రక్చరింగ్… పేరు ఏదైనా ఫలితం ఒకటే… అదే ఉద్యోగులపై వేటు! ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్, తోషిబా కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాయి. రీస్ట్రక్చరింగ్ పేరుతో తోషిబా కార్పొరేషన్ చేపట్టిన చర్యల వల్ల దాదాపు 5 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరోవైపు గూగుల్ తాజాగా అమలు చేస్తున్న లే ఆఫ్ల వల్ల ఆ కంపెనీలోని రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లలోని అనేక మంది ఉద్యోగులపై వేటు పడనున్నది.