AI | అధునాతన సాంకేతిక యుగంలో ‘ఏఐ’ ఇప్పుడొక సంచలనం.. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్రిసియేషన్ డే
AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అధునాతన సాంకేతిక యుగంలో ఇప్పుడొక సంచలనం. చూస్తుండగానే ఈ కృతిమ మేధ మన జీవితంలో అడుగుపెట్టేసింది. ఏఐ చాట్‌బాట్‌తో పిల్లల హోంవర్క్ మొదలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోడింగ్ వరకూ ప్రతీది మునివేళ్లమీది పనిలా మారిపోయింది. ఇటీవల ఓ అమెరికా మహిళ ఏకంగా ఏఐ చాట్‌బాట్ ద్వారా రెప్లికాను తయారు చేసి, పెండ్లి కూడా చేసుకొన్నది.
- కృత్రిమ మేధతో అన్ని రంగాల్లోనూ అద్భుతాలు
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అధునాతన సాంకేతిక యుగంలో ఇప్పుడొక సంచలనం. చూస్తుండగానే ఈ కృతిమ మేధ మన జీవితంలో అడుగుపెట్టేసింది. ఏఐ చాట్‌బాట్‌తో పిల్లల హోంవర్క్ మొదలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోడింగ్ వరకూ ప్రతీది మునివేళ్లమీది పనిలా మారిపోయింది. ఇటీవల ఓ అమెరికా మహిళ ఏకంగా ఏఐ చాట్‌బాట్ ద్వారా రెప్లికాను తయారు చేసి, పెండ్లి కూడా చేసుకొన్నది. ఆయనే తన పర్ఫెక్ట్ జోడీ అని మురిసిపోయింది. తాజాగా, ఏఐ న్యూస్ యాంకర్లు కూడా హల్చల్ చేశారు. స్టార్టప్‌లనుంచి అగ్రశ్రేణి ఐటీ కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. కాగా, భవిష్యత్తు సాంకేతిక సాధనంగా మారిపోయిన ఈ ఏఐని మెచ్చుకొనేందుకు ఓ రోజు ఉందని మీకు తెలుసా? ప్రతి ఏటా జూలై 16న ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్రిసియేషన్ డే’ను జరుపుకొంటున్నారు. ఈ రోజున ఏఐ సేవలను ప్రశంసిస్తారు.
రెండువైపులా పదునున్న కత్తి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండువైపులా పదునున్న కత్తి అని మరికొంతమంది నిపుణులు అభివర్ణించారు. ఈ కృత్రిమ మేధతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. ఏఐతో ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారని, భవిష్యత్తులో చాలామందికి ఉపాధి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో ఏఐ కారణంగా 23 శాతం ఉద్యోగాలు ఊడుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలకు ఈ కృత్రిమ మేధతో ముప్పు పొంచి ఉన్నదని తెలిపింది. తాజాగా, దుకాణ్ అనే ఈ కామర్స్ స్టార్టప్ 90శాతం మంది ఉద్యోగులను తొలగించి, వారిస్థానంలో ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. అదే సమయంలో ఏఐతో కార్మికశక్తి ఉద్పాతకత పెరుగుతుందని మెకిన్సీ వెల్లడించింది. కార్మిక ఉత్పాదక వృద్ధి 2040 నాటికి 0.1 నుంచి 0.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

