18 ఏళ్ల యువకుడిగా మారేందుకు 45 ఏళ్ల వ్యక్తి ప్రయత్నం.. ఏడాదికి 16.3 కోట్లు వ్యయం
ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యాన్ని ఆయన పొందాడు.
వాషింగ్టన్: వయసు పైబడిన వారంతా తమ శరీరంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఫిట్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు. కొందరు కాస్మోటిక్ సర్జరీ ద్వారా యంగ్‌గా కనిపించేందుకు ఆరాటపడుతుంటారు. అయితే అమెరికాకు చెందిన 45 ఏళ్ల మిలియనర్ ఏకంగా 18 ఏళ్ల వ్యక్తి మాదిరిగా మారేందుకు తెగ తాపత్రయం పడుతున్నాడు. ఆ వయసు శరీరం, దృఢత్వంతోపాటు అవయవాల తీరు కోసం ఏడాదికి సుమారు 16.3 కోట్లు (రెండు మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాలని నిర్ణయించాడు. వయసును రివర్స్ చేసే ఖరీదైన వైద్య విధానాలను ఆయన పాటిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
కాలిఫోర్నియాలోని వెనిస్కు చెందిన 45 ఏళ్ల బ్రయాన్ జాన్సన్, సుసంపన్నమైన సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు. బయోటెక్నాలజీ రంగంలో కూడా ఆయనకు అపార అనుభవం ఉంది. దీర్ఘ వయసుకు సంబంధించిన జర్నల్స్ చదివి శాస్త్రీయ అవగాహన పెంచుకున్నాడు. ఈ అంశంపై పట్టుండటంతోపాటు గునియా పందిపై పరిశోధనలు చేస్తున్న 29 ఏళ్ల పునరుత్పత్తి మెడిసిన్ డాక్టర్ ఆలివర్ జోల్మాన్ నేతృత్వంలో వయసు తగ్గించుకునే పనిలో పడ్డాడు. 30 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణుల పర్యవేక్షణలో 18 ఏళ్ల వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీని కోసం ఆయన నివాసంలో ఏకంగా ఒక మెడికల్ సూట్‌ను ఏర్పాటు చేశారు.
మరోవైపు 18 ఏళ్ల యువకుడిగా మారేందుకు జాన్సన్ ప్రతి రోజూ ఖరీదైన వైద్య విధానాలు పాటిస్తున్నాడు. దీని కోసం ఏడాదికి ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యం పొందాడు.
కాగా, జాన్సన్ శరీరంలోని అన్ని అవయవాల వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టి 18 ఏళ్ల వ్యక్తి శరీరంతోపాటు అవయవాలుగా తీర్చిదిద్దడానికి తాను కట్టుబడి ఉన్నట్లు డాక్టర్ ఆలివర్ జోల్మాన్ పేర్కొన్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, నరాలు, దంతాలు, చర్మం, జుట్టు, మూత్రాశయం, పురుషాంగం సహా అన్ని శరీర భాగాలు, అవయవాలను 18 ఏళ్ల యువకుడి మాదిరిగా జాన్సన్ కోరుకుంటున్నట్లు చెప్పారు. దీని కోసం ఈ ఏడాది రెండు మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ఆయన భావిస్తున్నారని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

