ఒకే టైంలో టేకాఫ్, ల్యాండింగ్.. పైలట్ చాకచక్యంతో రెండు విమానాలకు తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
JetBlue Plane Scrapes Tail | రన్ వేపై ల్యాండ్ అవుతున్న విమానాన్ని ఢీకొట్టకుండా ఉండేందుకు టేకాఫ్ అవుతున్న విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. విమానం ముందు భాగాన్ని బాగా ఎత్తుకు లేపాడు. ఈ నేపథ్యంలో విమానం తోక భాగం రన్‌వేకు రాసుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వాషింగ్టన్: రన్ వేపై ల్యాండ్ అవుతున్న విమానాన్ని ఢీకొట్టకుండా ఉండేందుకు టేకాఫ్ అవుతున్న విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. విమానం ముందు భాగాన్ని బాగా ఎత్తుకు లేపాడు. ఈ నేపథ్యంలో విమానం తోక భాగం రన్‌వేకు రాసుకుంది. (JetBlue Plane Scrapes Tail) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని కొలరాడోలో ఈ సంఘటన జరిగింది. ప్రాంతీయ విమానాశ్రయం నుంచి జెట్‌బ్లూ విమానం టేకాఫ్ అవుతోంది. ఇంతలో అదే రన్‌వే పై బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 350 విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఈ రెండు విమానాల మధ్య కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది.
కాగా, ఇది చూసి బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ పైలట్ అప్రమత్తమయ్యాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంభాషణ సందర్భంగా తమ విమానాన్ని ఢీ కొట్టబోరని ఆశిస్తున్నట్లు జెట్‌బ్లూ పైలట్‌తో అన్నాడు. దీంతో ఢీని నివారించేందుకు జెట్‌బ్లూ విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. విమానం రన్‌వే మధ్యలో ఉండగానే ముందు భాగాన్ని బాగా పైకి లేపాడు. ఈ నేపథ్యంలో తోక భాగం రన్‌వేకు రాసుకుంది. ఈ అసాధారణ టేకాఫ్‌ను చూసి ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు.
మరోవైపు టేకాఫ్ అయిన వెంటనే జెట్‌బ్లూ విమానం కుడివైపునకు మళ్లిందని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) తెలిపింది. దీంతో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. ఈ సంఘటన గత ఏడాది జరిగినట్లు వెల్లడించింది. అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా స్థానిక విమానాశ్రయాల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తన పైలట్లకు జెట్‌బ్లూ శిక్షణ ఇచ్చినట్లు వివరించింది. కాగా, విమానం ముందు భాగం బాగా పైకి లేచి తోక భాగం రన్‌వేకు రాసుకుంటూ టేకాఫ్ అయిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video: JetBlue Plane Scrapes Tail During Take-Off To Avoid Head-On Collision With Another Flight https://t.co/8ufMFdpOzZ pic.twitter.com/QUIThSJegv
— NDTV (@ndtv) December 15, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

