రాకెట్ పిడుగులు
- వచ్చే పదేండ్లలో మనుషుల్ని తాకే ప్రమాదం 10% వరకు
- జకార్తా, ఢాకా, లాగోస్ నగరాలకు ముప్పు ఎక్కువ
- బ్రిటిష్ కొలంబియా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
టోరంటో, ఆగస్టు 10: సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి రాకెట్లను నింగిలోకి పంపిస్తుండటం తెలిసిందే. అయితే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం రాకెట్ భాగాలు విడిపోయి వ్యర్థాలుగా మారుతాయి. ఇలా వ్యర్థాలుగా మారిన రాకెట్ విడిభాగాలు భూ దిగువ కక్ష్యలో వేలాదిగా పరిభ్రమిస్తున్నాయి.
వాటిని అయస్కాంత శక్తి సాయంతో మళ్లీ భూమి మీద ఉన్న సముద్రాల్లో పడేయకపోవడం వల్ల ఆ భారీ శకలాలు భూమి మీదకు తిరిగి ఎప్పుడు విరుచుకుపడుతాయోనన్న ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా.. భూకక్ష్యలో ఉన్న రాకెట్ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకులు హెచ్చరించారు.
ఆ వ్యర్థాలను వెంటనే అయస్కాంత శక్తులతో సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చని అన్నారు. ఒకవేళ, ఆ శకలాలు ప్రయాణిస్తున్న విమానం లేదా పాఠశాల భవనంపై పడితే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వివరాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. శకలాలు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు: జకార్తా, ఢాకా, లాగోస్శకలాలు పడే ప్రమాదం తక్కువగా ఉన్న ప్రాంతాలు: న్యూయార్క్, బీజింగ్, మాస్కో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

